ఇటలీలో ఒక్కరోజే 196 మంది మృతి.. పంజా విసురుతున్న కరోనా
- ఆ దేశంలో 827కు చేరిన మృతుల సంఖ్య
- 12 వేలు దాటిపోయిన వైరస్ బాధితులు
- హోటళ్లు, బార్లు, రెస్టారెంట్ల మూసివేత
- బాధ్యతగా ఉంటే మనల్ని మనం రక్షించుకోవచ్చని ఇటలీ ప్రధాని పిలుపు
కరోనా వైరస్ వ్యాప్తి మొదలైన చైనాలో నియంత్రణలోకి రాగా, పలు దేశాల్లో మాత్రం అత్యంత ప్రమాదకరంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా ఇటలీపై కరోనా పంజా విసురుతోంది. ఆ దేశంలో ఇప్పటివరకు 12,462 మందికి వైరస్ సోకగా 827 మంది మరణించారు. ఇందులో బుధవారం ఒక్క రోజే 196 మంది చనిపోవడంతో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. మృతుల సంఖ్య ఒక్క రోజులోనే 30 శాతం పెరగడం, ఒక్క రోజులోనే అదనంగా 2,200 మందికి వైరస్ సోకడంతో ఇటలీలో అత్యవసర పరిస్థితిని విధించారు.